మరో లోన్ యాప్ కేటుగాళ్లను అరెస్టు చేసిన రాచకొండ పోలీస్
- January 13, 2021
హైదరాబాద్:రాచకొండ పోలీసులు మరో లోన్ యాప్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, వారిలో ఒకరు చైనీయుడు కూడా ఉన్నాడు. తాజాగా, రాచకొండ క్రైం పోలీసులు ముంబై కేంద్రంగా సాగుతున్న కాల్ సెంటర్ మీద దాడులు నిర్వహించారు. వారి బ్యాంక్ అకౌంట్‌లోని 28 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ లోన్ యాప్స్ వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ స్టంట్ యాప్స్‌లో లోన్లు తీసుకున్న తర్వాత వారి వేధింపులు ఎలా ఉంటాయో చెబుతూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూగుల్ ప్లే స్టోర్లో అలాంటి యాప్స్ ఏమేం ఉన్నాయో వెంటనే గుర్తించాయి. ఆయా యాప్స్‌ను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్‌కు లేఖ కూడా రాశాయి.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చాలా సార్లు సూచించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలకు లోబడి ఉన్న సంస్థల దగ్గరే రుణాలు తీసుకోవాలని తెలిపింది. కొన్ని యాప్స్ అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్టు తమకు తెలిసిందన్న ఆర్బీఐ… సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని సూచించిన సంగతి తెలిసిందేది. లోన్ యాప్స్ కోసం వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇక ఈ తరహా యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే చాలా తెలిపింది.లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







