కువైట్:ఇంగ్లీష్ వచ్చినవారికే ఉన్నత ఉద్యోగాలు...
- January 14, 2021కువైట్ సిటీ:ఉన్నత ఉద్యోగాలకు సంబంధించి కువైట్ కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సుపర్ వైజర్ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలని కండీషన్ పెట్టింది. ఈ మేరకు ప్రజా పనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరిపాలనా పరమైన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, సుపర్ వైజర్ స్థాయి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంగ్లీష్ టెస్ట్ ఓ భాగం కానుందని స్పష్టం చేసింది. ఆ స్థాయి ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్ధులు ముందుగా తాము పెట్టిన ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనని వివరించింది. ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన వెలువడిన పది పని రోజుల్లో అభ్యర్ధులు పర్సనల్ అఫైర్స్ డైరెక్టర్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హజరవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఉద్యోగాల అప్లికేషన్‌ను నింపి, ఇంగ్లీష్ టెస్టులో పాసైన వారికే ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని మంత్రిత్వ కార్యదర్శి తమ ఉత్తర్వులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం