వృద్ధులకు ఇంటి దగ్గరే వ్యాక్సిన్...బహ్రెయిన్లో మొబైల్ టీమ్స్ ఏర్పాటు
- January 14, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు బహ్రెయిన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందితేనే కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలమని చెబుతున్న బహ్రెయిన్ ఆరోగ్య శాఖ...కింగ్డమ్ పరిధిలోని అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్య కేంద్రాలకు రాలేని వారి కోసం మొబైల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ బృందాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చి వస్తారు. అయితే..మొబైల్ టీమ్స్ అవసరం ఉందని నిర్ధారించుకునేందుకు కమిటీ సూచనలు పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కావాలని ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. దరఖాస్తుల ఆధారంగా..వృద్ధుల వివరాలను తెలుసుకుంటోంది. రిజిస్టర్ లో పేర్కొన్న అడ్రస్ లకు మొబైల్ బృందాలు వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికను అనుసరిస్తోంది.వ్యాక్సిన్ కోసం ఇంకా వివరాలను నమోదు చేసుకోని వారు http://healthalert.gov.bh వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని..లేదా 444కి కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







