కువైట్:ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్..భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
- January 14, 2021
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఆర్ధిక మోసాలపై కువైట్ లోని ఎంబసీ అధికార కార్యాలయం..ఇండియన్ కమ్యూనిటీ అప్రమత్తం చేసింది. కొందరు నేరగాళ్లు ఎంబసీ అధికారులమని చెప్పి కువైట్లోని భారతీయులను నమ్మిస్తున్నారని, ఆ తర్వాత వివరాల అప్ డేట్ ఫీజులు, ఇతర కారణాలు చెప్పి డబ్బు పింపించాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వివరించారు. ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ప్రధానంగా భారతీయ సమాజాన్నే లక్ష్యంగా చేసుకుందని హెచ్చరించారు. ఎంబసీ కార్యాలయ అధికారులు అనవసరంగా ఫోన్ చేయరనే విషయాన్ని కువైట్ లోని భారతీయులు గమనించాలని కోరారు. అంతేకాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగరని గుర్తుంచుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలను కూడా ఎంబసీ అడగబోదని తెలిపారు. అందువల్ల ఎంబసీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి నగదు బదిలీ చేయాలని కోరినా, బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలను
అడిగినా ఇవ్వొద్దని సూచించారు. అంతేకాదు..ఎంబసీ అందిస్తున్న సేవల పట్ల అవగాహన లేకుంటే http://www.indembkwt.gov.in/వెబ్ సైట్ ద్వారా వివరాలు తెల్సుకోవచ్చని వెల్లడించింది. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు కోరినా, బ్యాంకు ఖతా, క్రెడిట్ కార్డు వివరాలు అడిగినా వెంటనే [email protected] కి ఫిర్యాదు చేయాలన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







