కారు టైర్ బాగా లేకున్నా ఫైన్, బ్లాక్ పాయింట్స్..వాహనదారులకు యూఏఈ వార్నింగ్
- January 14, 2021
యూఏఈ ట్రాఫిక్ పోలీసులు వాహన నిబంధనల్లో కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక నుంచి టైర్లు పాడైపోయిన కారులో ప్రయాణించినా ఫైన్ తో పాటు బ్లాక్ పాయింట్లు వేస్తామని అబుధాబిలోని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాడైపోయి, పగుళ్లు పట్టిన టైర్లు ప్రమాదానికి కారణమవుతున్నాయని, ప్రయాణంలో ఉన్నప్పుడు టైర్లు పేలిపోవటం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే పాతబడిన టైర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని వివరించారు. ఇక నుంచి ఎవరైనా పాతబడిన టైర్లను మార్చుకోకుండా కార్లను రోడ్ల మీదకు తీసుకొస్తే Dh500 జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా లాంగ్ జర్నీకి వెళ్లే వారు టైర్ల కండీషన్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







