నిమ్మరసంతో అద్భుతమైన ప్రయోజనాలు...
- January 15, 2021వేసవి కాలంలోనే కాదండోయ్.. ఏ కాలంలో అయినా నిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో సీజనల్ వ్యాధులు దరి చేరవు. చర్మ సంబంధిత సమస్యలు రావు. ఇక డయాబెటిస్ (చక్కెర వ్యాధి)తో బాధపడుతున్న వారైతే రోజూ ఓ గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే అనేక లాభాలు.. విటమిన్ సి ఉన్న ఏ ఆహార పదార్థాలైనా షుగర్ ఉన్న వారికి మంచిది. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మీడియం సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. అందువలన డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వలన ఇందులో ఉన్న ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ తీసుకునే అవసరం ఎక్కువగా ఉండదు. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నిమ్మరసం రోజూ తీసుకుంటే ఇందులో ఉన్న పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి