కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా
- January 15, 2021
కువైట్ సిటీ:విమాన సంస్థలకు కువైట్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఊరట కల్పించింది. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను విమాన సంస్థలే భరించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అవలంభించాలని సూచించింది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన జనవరి 17 నుంచి విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పీసీఆర్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..కువైట్ మంత్రి వర్గ నిర్ణయం మేరకు కువైట్ విమానాశ్రయాల్లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ ఛార్జీల భారాన్ని ఆయా విమాన సంస్థలే భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం అమలును కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్నే పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







