వాట్సాప్ స్కాం పట్ల తస్మాత్ జాగ్రత్త..వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక

- January 16, 2021 , by Maagulf
వాట్సాప్ స్కాం పట్ల తస్మాత్ జాగ్రత్త..వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక

యూఏఈ:'హాయ్ ఐయామ్ సారీ..బై మిస్టేక్ మీ నెంబర్ కు 6 డిజిట్ కోడ్ పంపించాను...దయచేసి నాకు కోడ్ ను షేర్ చేస్తారా! ఇట్స్ అర్జెంట్'...ఇటీవలి కాలంలో మీ వాట్సాప్ నెంబర్ కు ఇలాంటి మెసేజ్ లు ఏమైనా వచ్చాయా? అయితే..బీ కేర్ ఫుల్. వాట్సాప్ అకౌంట్ ను హ్యాక్ చేసేందుకు కొందరు నేరగాళ్లు వాడుతున్న ట్రిక్ ఇది. ఇలాంటి మెసేజ్ లు వస్తే వాట్సాప్ వినియోగదారులు..అప్రమత్తంగా వ్యవహరించాలని యూఏఈ టెలికమ్యూనికేషన్ అధికారులు కోరారు. సాధారణంగా వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ వెరిఫేకేషన్ కోసం 6 డిజిట్ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తారు. ఆ కోడ్ ను ఎంటర్ చేస్తేనే వేరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే..ఫోన్ నెంబర్ ప్లేసులో ఇతర వినియోగదారుల నెంబర్ ను ఎంటర్ చేసి వారికి వచ్చే కోడ్ ను కనుక్కునేందుకు పొరపాటున మీకు కోడ్ పంపించాము..దయచేసి కోడ్ ను మాకు షేర్ చేయండి అంటూ ప్లీజ్డ్ మ్యానర్లో బాధితులను బురిడి కొట్టిస్తారు. అర్జంట్ అంటూ ఒత్తిడి చేయటం ద్వారా బాధితులకు ఆలోచించుకునే అవకాశం లేకుండా చేస్తారు. ఆ అయోమయంలో బాధితులు తమకు వచ్చిన కోడ్ ఎస్ఎంఎస్ ను షేర్ చేస్తే హ్యాకర్లు వారి వాట్సాప్ అకౌంట్లను తమ చేతుల్లోకి తీసుకుంటారు. అంటే బాధితుల మొబైల్ లోని వాట్సాప్ పూర్తిగా బ్లాక్ అయిపోయి..అకౌంట్ యాక్టివేషన్ మొత్తం  హ్యాకర్ల వశం అవుతుంది.

అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవరీ చేయాలి?
దురదృష్టవశాత్తు వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే...ఎలాంటి చర్యలు తీసుకోవాలో యూఏఈ టెలికమ్యూనికేషన్ కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం..హ్యాకర్ల బారిన పడిన బాధితులు తమ మొబైల్ లోని వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇలా పదే పదే చేయాలి. ఎదో ఒక అటెంప్ట్ లో అకౌంట్ రికవరి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ అకౌంట్ రికవరి కాకుంటే వాట్సాప్ టెక్నికల్ సపోర్ట్ విభాగానికి [email protected] ద్వారా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులో లాస్ట్/స్టోలెన్ అని టైప్ చేసి మీ ఫోన్ నెంబర్ ను కంట్రీ కోడ్ తో కలిపి ఎంటర్ చేయాలి. దీంతో పాటు ప్రతి రోజు పదే పదే వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసి ప్రయత్నిస్తుండాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com