కర్ణాటక:విహార యాత్రలో విషాదం.. 13 మంది బాల్యమిత్రులు..

- January 16, 2021 , by Maagulf
కర్ణాటక:విహార యాత్రలో విషాదం.. 13 మంది బాల్యమిత్రులు..

కర్ణాటక:20 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు.. త్వరలో తాము సెలబ్రేట్ చేసుకోబోయే పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ప్లాన్ చేద్దామనుకున్నారు. 16 మంది క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి గోవా బయల్దేరారు. వారి స్నేహం చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. అందులో కొందర్ని మృత్యువు కబళించింది. స్నేహితుల్ని విడదీసింది. పూణే-బెంగళూరు జాతీయ రహదారి 47 లోని ధార్వాడ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. తమ పూర్వ విద్యార్థుల కార్యక్రమం గురించి చర్చించడానికి గోవా వెళ్తున్నారు దావంగెరెలోని సెయింట్ పాల్స్ కాన్వెంట్ విద్యార్థులు.

ఈ సంవత్సరం జరగాల్సిన పాఠశాల 75 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్నేహితులంతా కలిసి మెగా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. వారంతా తమ కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. తమ పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలని ఆశిస్తున్నారు.

ఇటిగట్టి సమీపంలో హుబ్బల్లి-ధార్వాడ్ బైపాస్ వెంట టిప్పర్ ట్రక్కును మినీబస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విహారయాత్రకు గోవాకు వెళుతున్న పది మంది మహిళలు, వారి డ్రైవర్ శుక్రవారం కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుల్లో దావంగెరే జగళూరుకు చెందిన మాజీ బిజెపి ఎమ్మెల్యే, ప్రీతి రవికుమార్ కుమార్తె కూడా ఉన్నారు. ఆమె మాజీ ఎమ్మెల్యే గురు సిద్ధానగౌడ కుమార్తె. ఉదయం 8 గంటల సమయంలో మినీ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ధార్వాడ్ సబ్ అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ యాలిగర్ తెలిపారు.

మినీ బస్సులోని డ్రైవర్‌తో పాటు 10 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో డ్రైవర్ ప్రవీణ్, స్నేహితులు .. ఆశా, మీరాబాయి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేద, వీణ, మంజుల, నిర్మలా, రజనీష్, స్వాతి, ప్రీతి రవికుమార్ సహా 10 మంది మహిళలు ఉన్నారు. ఐదుగురు మహిళలకు, టిప్పర్ ట్రక్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 32 కిలోమీటర్ల హుబ్బల్లి-ధార్వాడ్ బైపాస్ రోడ్డు బెంగళూరు, పూణే మధ్య ఉంది NH 48. ఇన్స్పెక్టర్ యాలిగర్ మాట్లాడుతూ ధార్వాడ్ నివాసితులు బైపాస్ రోడ్డుప్రమాదకరమైనదని ఫిర్యాదు చేస్తున్నారని, ఇది ఇరుకైనదని, దీనిని వన్ వేగా ఉపయోగించడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాల కారణంగా గత కొన్ని నెలలుగా రోడ్డు వెడల్పు పనులు ఆలస్యం అవుతున్నాయని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com