సౌదీ అరేబియాలో మహిళా జడ్జిల నియామకం
- January 16, 2021
రియాద్:సౌదీ అరేబియా త్వరలోనే మహిళా జడ్జిల నియామకం చేపట్టనుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ - విమెన్ ఎంపవర్మెంట్ అండర్ సెక్రెటరీ హింద్ అల్ జాహిద్ ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాలిద్ అల్ సమాని, ఇటీవలే 100 మంది విమెన్ నోటరీల నియామకానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే పలువురు మహిళల్ని లా, షరియా, సోషియాలజీ, అడ్మినిస్ట్రేషన్ మరియు టెక్నాలజీ వంటి విభాగాల్లో నియమించడం జరిగింది. 2025 నాటికి 25 శాతం మంది మహిళలకు సౌదీ లేబర్ మార్కెట్లో అవకాశాలు కల్పించాలనే లక్షం పెట్టుకోగా, ఇప్పటికే 31 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇతర విభాగాలతో పోల్చితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో మహిళల నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అల్ జాహిద్ చెప్పారు. లేబర్ మార్కెట్లో పురుషులతో సమాన అవకాశాలు మహిళలకు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!