ప్రజా నటికి-విశిష్ట మాతృమూర్తి జాతీయ పురస్కారం
- January 17, 2021
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి కరకమలముల చే ప్రారంభింపబడిన "రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్" హైదరాబాద్, ఇండియా చే జనవరి 16 వ తేదీ సాయంత్రం అంతర్జాలంలో ఊటుకూరు రత్నసుందరి 74 వ జయంతి సందర్భంగా స్వర్ణయుగ ప్రజానటి,పూర్వ పార్లమెంట్ సభ్యురాలు, కళాభారతి డా.జమునా రమణారావుకి "విశిష్ట మాతృమూర్తి జాతీయ పురస్కారం"బహూకరించారు.జమున స్వగృహంలో ఆమె మనుమడు ఆవిడను శాలువా తోనూ,అవార్డ్ తోనూ సత్కరించే వేడుక చూడముచ్చటగా జరిగింది.

ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రక్ష అధ్యక్షులు డా.పసుమర్తి రామలక్ష్మి ఉమాశంకర్ తెలియజేసారు.
గ్రహీత జమున తన జీవితంలో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ ఈ "విశిష్ట మాతృమూర్తి" అవార్డ్ పొందలేదన్నారు.ఈ అవార్డ్ తనకు ప్రత్యేక మైనది అని తెలిపారు .ప్రతివారి జీవితంలో వారి మాతృమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది.సుదీర్ఘ సినీ జీవితంలో షూటింగ్ లలో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ తన ఇద్దరు పిల్లలను నిర్లక్యం చేయకుండా,చక్కని క్రమశిక్షణతో పెంచినట్లు వివరించారు.అందుకే ఈ అవార్డ్ పొందినందుకు తల్లిగా గర్విస్తున్నానన్నారు.
కార్యక్రమంలో పద్మభూషణ్ డా.కె.ఐ. వరప్రసాద్ రెడ్డి చైర్మన్ శాంతా బయో టెక్నిక్స్,డా.పి.మధుసూదన రావుగారు దూర దర్శన్ పూర్వ డైరెక్టర్,కళా బ్రహ్మ,శిరోమణి వంశీ రామరాజు,డా.కె.శంకరాచార్య ,నాంయాంగ్ యూనివర్సిటీ, సింగపూర్ మరియు రమా రావి వక్తలుగా పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమంలో లక్ష్మీ శ్రీనివాస్ అద్భుతంగా వీణ పాటలు ఆలపించారు.వ్యాఖ్యాత గా సింగపూర్ నుండి మనీషా నిర్వహించారు.ప్రతివారు కన్న తల్లిదండ్రులను పూజిస్తే భగవంతుడు తనను పూజించినట్టు భావిస్తాడని వక్తలందరూ వారి ప్రసంగంలో భావోద్వేగాల నడుమ పేర్కొన్నారు.


తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







