కమ్మేసిన పొగమంచు: వేగ పరిమితి తగ్గింపు
- January 19, 2021యూఏఈ వ్యాప్తంగా పలు ప్రాంతాల్ని పొగ మంచు కమ్మేస్తోంది. ఈ కారణంగా విజిబులిటీ గణనీయంగా తగ్గిపోతోంది. సోమవారం అర్థరాత్రి నుంచి పొగమంచు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వాహనదారులు పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, వేగ పరిమితికి లోబడి వాహనాలు నడపాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అబుదాబీ పోలీస్, వాహనాల వేగ పరిమితిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. క్యాపిటల్ వైపుగా వచ్చే రోడ్లపై వేగ పరిమితిని గంటకు 80 కిలోమీటర్లకే తగ్గించారు. అబుదాబీ అల్ అయిన్ రోడ్డు, అల్ ఫయాహ్ రోడ్డు, షేక్ ఖలీఫా ఇంటర్నేషనల్ రోడ్డు, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డు, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మరియు మక్తౌమ్ బిన్ రషీద్ రోడ్లపై వేగ పరిమితిని తగ్గించారు. ఆయా రోడ్లపై ఏర్పాటు చేసిన స్మార్టు బోర్డులపై ప్రదర్శితమయ్యే సూచనలను వాహనదారులు ఫాలో అవ్వాల్సి వుంటుంది. ముందు, వెనుక వాహనాలతో తగిన దూరాన్ని వాహనదారులు పాటించాలి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం