గృహ కార్మికుడి నియామక ఖర్చు KD990 గా కువైట్ నిర్ణయం
- January 19, 2021కువైట్: గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కు సంబంధించి నియామక ఖర్చులను కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అధికార విభాగం ఖరారు చేశాయి. విదేశాల నుంచి గృహ కార్మికుడ్ని తీసుకొచ్చే ఆఫీసుల ద్వారా రిక్రూట్మెంట్ జరిగితే..ఆ నియామక ఖర్చును 990 కువైట్ దినార్స్ గా నిర్ణయించారు. అలాగే కువైట్‌లోని డొమస్టిక్ వర్కర్లే నేరుగా యజమానులను సంప్రదించినట్లైతే రిక్రూట్మెంట్ కాస్ట్ ను 390 కువైట్ దినార్లుగా నిర్ణయించారు. అయితే...ఈ రిక్రూట్మెంట్లలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. గృహ కార్మికుడు ఒక యజమాని దగ్గర కనీసం ఆరు నెలలైన పని చేయాలి. ఈ మేరకు ముందే అగ్రిమెంట్ రాసివ్వాలి. ఒక వేళ ఒప్పంద ఉల్లంఘన జరిగితే..మరో కార్మికుడ్ని నియమించుకునేందుకు వీలుగా సదరు యజమానికి నష్టపరిహారం చెల్లించాలసి ఉంటుంది. పౌరులు, ప్రవాసీయులపై ఆర్ధిక భారం తగ్గించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తే వెంటనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హాట్ లైన్ నెంబర్ 135కి కాల్ చేయాలని, లేదంటే [email protected] కి మెయిల్ చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..