సౌదీలో అందుబాటులోకి ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లు
- January 19, 2021
సౌదీ: కోవిడ్ 19కి విరుగుడుగా దేశ ప్రజల కోసం మరో రెండు వ్యాక్సిన్లను సౌదీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ను అందిస్తున్న సౌదీ ప్రభుత్వం..దానికి అదనంగా ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. అస్ట్రాజెనెకా, మెడెర్నా వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రకటించిన ఆరోగ్య శాఖ...ఇక నుంచి సౌదీ ప్రజలు కోవిడ్ కు విరుగుడుగా కొత్త వ్యాక్సిన్లను కూడా ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ తో పోలిస్తే..ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను తేలికగా రవాణా చేయవచ్చని అలాగే వాటిని భద్రపరచటం కూడా తేలికని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







