ఇక నుంచి ఈ-సర్వీస్ ద్వారా జీతాలు...ప్రైవేట్ కంపెనీలకు ఒమన్ ఆదేశాలు
- January 19, 2021
మస్కట్:ఒమన్ లో ఇక నుంచి అన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, పేమెంట్ల చెల్లింపులను ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఉద్దేశించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఇకపై సాంప్రదాయక చెల్లిపులకు అన్ని ప్రైవేట్ సంస్థలు స్వస్తి పలకాల్సిందే. దేశీయంగా జీతాలు, ఇతర పేమెంట్ల చెల్లింపుల విషయంలో పారదర్శకత వేగం పెంచే దిశగా చర్యలు చేపడుతూ నిర్ణయం తీసుకున్న ఒమన్ కార్మిక శాఖ...ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే ప్రైవేట్ సంస్థల చెల్లింపులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సెంట్రల్ బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంకు జనవరి 12న జీతాల చెల్లింపులపై నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ అనువుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని..అదే సమయంలో ఆయా ప్రైవేట్ సంస్థలకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ చర్యలు చేపట్టాలని కూడా కార్మిక శాఖ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ను ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..