వ్యాక్సిన్ తీసుకోని వారు కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిందే..
- January 19, 2021_1611067756.jpg)
యూఏఈ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ కొత్త రూల్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంని ముమ్మరం చేస్తూనే..మరోవైపు వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకోని పలు రంగాల్లోని ఉద్యోగులు తరచుగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ప్రభుత్వం భరించదు. పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ఆయా రంగాల్లోని ఉద్యోగులే భరించాల్సి ఉంటుందని కూడా యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 24 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. వ్యాక్సిన్ రావటంతో ఇక సాధారణ జనజీవనం దిశగా ప్రయత్నాలు ముమ్మరం అవుతుండటం..పలు కార్యాలయాల్లో విధులను పూర్తి స్థాయిలో మళ్లీ ప్రారంభిస్తుండటంతో ఉద్యోగుల విషయంలో ఈ చర్యలు తీసుకుంటోంది. అయితే..వ్యాక్సిన్
రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. వారు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రంగాల వారీగా ఏయే ఉద్యోగులు ఎన్ని రోజులకు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలనే వివరాలు ఇవి...
- ప్రభుత్వ ఉద్యోగులు: యూఏఈలోని మంత్రిత్వ శాఖలలో పని చేసే ఉద్యోగులు, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు సొంత ఖర్చులతో ప్రతి వారం రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు కాకుంటే మాత్రం టెస్ట్ ఖర్చును యాజమాన్యాలు భరించాలి.
- ఔట్ సోర్టింగ్ ఉద్యోగులు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసే వారికి ఆయా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కంపెనీలే పీసీఆర్ టెస్ట్ ఖర్చు భరించాల్సి ఉంటుంది.
- నిపుణులు, కన్సల్టెంట్లు : సమావేశాలకు హజరయ్యే నిపుణులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన కన్సల్టెంట్లు తమ మీటింగ్/విజిట్ కి ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. విజిట్ కి ముందు మూడు రోజుల లోపు చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
- హస్పిటల్ విజిట్స్ : ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి బయటి నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా వైరస్ సోకకుండా ఉండేందుకు విజిటర్స్ కు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేశారు. అబుధాబిలోని ఆస్పత్రులన్నింటిలోనూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అయితే..ఆస్పత్రి విజిట్ కు 24 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంటారు.
- అబుధాబి ఎంట్రీ: అబుధాబికి వెళ్లే వారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ చూపించాలి.అబుధాబికి చేరుకున్నాక నాలుగో రోజున తొలిసారి, ఎనిమిదవ రోజున రెండోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..