సౌదీలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు ప్రొఫెషనల్ టెస్ట్ తప్పనిసరి
- January 19, 2021_1611068313.jpg)
రియాద్:సౌదీ అరేబియాలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు నిబంధనలను కఠినతరం చేసింది స్థానిక ప్రభుత్వం. ఇక నుంచి ప్రొఫెషనల్ టెస్ట్ నిర్ణయించిన తర్వాత కింగ్డమ్ లో జాబ్ వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు..అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వివరాలను, ప్రాక్టికల్ ఎక్స్ పీరిన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోనుంది. విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ శాఖ ఉన్నతాధికారులు, సౌదీ ఇంజనీర్ల మండలి అధికారులు సౌదీయేతర ఇంజనీర్ల ఉద్యోగాలకు సంబంధించి సమీక్షించారు. కింగ్డమ్ లో ఇంజనీర్లుగా జాబ్ చేసేందుకు ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసేలా ఈ కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారుల ప్రకటించారు. సోసైటి భద్రతకు తమకు అత్యంత ముఖ్యమని ఈ విషయంలో రాజీ ప్రస్తావన ఉండబోదని వెల్లడించారు. ప్రొఫెషనల్ టెస్ట్ క్లియర్ చేసిన వారికే సౌదీ వచ్చేందుకు జాబ్ వీసా మంజూరు చేస్తారని వివరించారు. పీయర్సన్ వీయూఈ భాగస్వామ్యంతో సౌదీ రావాలనుకునే ఇంజనీర్లకు వారి సొంత దేశాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి టెస్ట్ క్లియర్ అయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!