హైదరాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ డిపార్చర్స్ ప్లాజా ప్రీమియం లాంజ్‌ పునః ప్రారంభం

- January 19, 2021 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ డిపార్చర్స్  ప్లాజా ప్రీమియం లాంజ్‌ పునః ప్రారంభం

హైదరాబాద్: ప్రయాణీకుల మంచి ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడమంటే విమానాశ్రయంలో షాపింగ్, రుచికరమైన భోజనాలు మాత్రమే కాదు. ప్రయాణికుల భద్రతా తనిఖీ పూర్తయిన తర్వాత, వారు హాయిగా కూర్చోవడానికి, విమానంలో ఎక్కే ముందు విమానాశ్రయంలో కొంత సమయం గడపడం కోసం ఒక ప్రశాంతమైన స్థలం కోసం వెదుక్కుంటారు. 

ప్రయాణీకులు ప్రయాణించబోయే ముందు వాళ్లను తిరిగి కనెక్ట్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి ఒక మంచి ప్రదేశం అవసరం. విమానాశ్రయ లాంజ్‌లు విమాన ప్రయాణానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి టికెట్ లాంటివి. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన, పునరుద్దరించబడిన ప్లాజా ప్రీమియం లాంజ్ ప్రయాణాలకు ఒక సుసంపన్నమైన మార్గం. డొమెస్టిక్ డిపార్చర్స్ విభాగంలో ఉన్న ఈ లాంజ్ 773 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇక్కడ 222 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 

GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమర్లకు ఆనందాన్ని అందివ్వాలని భావిస్తుంది. ఆతిథ్య సేవలలో ప్లాజా ప్రీమియం లాంజ్ ప్రముఖ ప్రపంచ విమానాశ్రయాలలో ముందు వరుసలో ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ లాంజ్‌లో ప్రయాణికుల కోసం వర్క్ స్టేషన్లు, వై-ఫై, ప్రత్యేక అతిథులు, విఐపీల కోసం ప్రైవేట్ సీటింగ్ జోన్, లాంజ్ సీటింగ్ మొదలైనవి ఉన్నాయి.

అలసిపోయిన ప్రయాణికులు విశ్రాంతి తీసుకుని, చైతన్యం పొందడానికి వారు లాంజ్ వద్ద సురక్షితమైన  మసాజ్ మరియు వెల్‌నెస్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. సుదీర్ఘ విమాన ప్రయాణానికి ముందు షవర్ సదుపాయాలు కూడా ఇక్కడ లభిస్తాయి. 

ప్రీమియం ప్లాజా లాంజ్‌లోని రెక్లైనర్ సీట్లలో కూర్చుని విమానాశ్రయ రన్‌వే సుందర దృశ్యాలను వీక్చించవచ్చు.  బార్ నుండి వారికిష్టమైన కాక్‌టెయిల్ లేదా మాక్‌టెయిల్‌ను సిప్ చేయవచ్చు. ప్రయాణీకులు ఎంపిక చేసుకోవడానికి బార్‌లో ప్రపంచ స్థాయి బ్రాండ్ల మద్యాలు లభిస్తాయి.

లాంజ్‌లో సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. లాంజ్ మూలమూలలా శుభ్రం చేయబడి, పరిశుభ్రపరచబడిందని నిర్ధారించడానికి అత్యున్న భద్రతా ప్రమాణాలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు విశ్రాంతి, ఆందోళన లేని విమానాశ్రయ అనుభవాన్ని ఆస్వాదించడానికి విస్తృత బఫే ఏర్పాట్లూ ఇక్కడున్నాయి. ప్రయాణ సమయాన్ని బట్టి ప్రయాణీకులు లైవ్ ఫుడ్ కౌంటర్ల సదుపాయాన్నీ ఉపయోగించుకోవచ్చు.

జోన్ వారీగా సంగీత నియంత్రణ, మెరుగైన సౌకర్యం కోసం యాంబియంట్ టెంపరేచర్ సెట్టింగ్, పిల్లలకు ప్రత్యేక కుర్చీలు ఇక్కడున్న మరికొన్ని ప్రత్యేక సదుపాయాలు. ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన వాష్‌రూమ్ సౌకర్యం, బేబీ కేర్ ఫెసిలిటీ కూడా ఇక్కడున్నాయి.

లాంజ్‌లో ఏర్పాటు చేసిన అనేక స్క్రీన్‌ల ద్వారా ప్రయాణీకులు తమ విమాన షెడ్యూల్‌ అప్‌డేట్ సమాచారాన్ని పొందవచ్చు. సిసిటివి కెమెరాల ద్వారా లాంజ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నందున సాధారణ ప్రయాణికులతో పాటు విఐపిలు, ప్రత్యేక అతిథులకు కూడా అత్యధిక భద్రత లభిస్తుంది.

ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి, వారి ప్రయాణ అనుభవాన్ని మరపురానిదిగా చేయడానికి ఈ లాంజ్ 24 గంటలూ తెరిచి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com