కువైట్: వృద్ధులకు నో రెసిడెన్సీ రెన్యూవల్స్..70 ఏళ్లు దాటితే దేశం విడిచి వెళ్లాల్సిందే
- January 20, 2021
కువైట్ సిటీ:దేశంలో ఉంటున్న ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ పై కొన్ని సవరణలు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వృద్ధులకు నివాస అనుమతులను రెన్యూవల్ చేసేది లేదని స్పష్టం చేసింది. అయితే..వారి విద్యార్హతలు, దేశావసరాలకు అనుగుణంగా సరిపోయే వృత్తి నైపుణ్యత ఉన్న వారికి మాత్రం వయసుకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులు కువైట్లో రెసిడెన్సీ రెన్యూవల్ చేయించుకోవాలనుకుంటే హై స్కూల్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 65 ఏళ్లకు మించిన వృద్ధులు ప్రత్యేక నైపుణ్య రంగాల్లో గ్రాడ్యుయేట్లు అయి ఉండి...దేశ అవసరాలకు సరిపోయేలా కీలక రంగాల్లో ఉంటేనే నివాస అనుమతులను రెన్యూవల్ చేయనున్నారు. అంటే వైద్య రంగంలో స్పెషలైజేషన్ లేదా కన్సల్టెంట్స్, ఇతర నైపుణ్య రంగాల్లో ఉన్న వారికి రెసిడెన్సీ రెన్యూవల్ చేయనున్నారు. ఇక 70 ఏళ్లు అంతకుమించి వయసుపైబడిన వారికి హైస్కూల్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యూయేషన్, ఇతర నైపుణ్య రంగాల్లో ఉన్నా రెసిడెన్సీ రెన్యూవల్ చేయబోమని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్