హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ కు బెయిల్
- January 20, 2021
న్యూఢిల్లీ: స్కీముల పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించి వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరు వారాలపాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ముగ్గురు జడ్జిల బెంచ్ ఉత్తర్వులిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని గత ఏడాది నౌహీరా షేక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ( ఎస్ఎఫ్ఐఓ ) తోపాటు ఐపీసీ ప్రకారం విచారణ చేపట్టేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. నౌహీరా షేక్ కు బెయిల్ మంజూరు చేయాలని.. జైలు నుంచి బయటకు వచ్చాక డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని ఆమె తరపున లాయర్ రంజిత్ కుమార్ బెంచ్ ను కోరారు. గత విచారణలో ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించినట్టు చెప్పారు. సుదీర్ఘకాలంగా జైలులో ఉన్న నిందితురాలు. బయటకు రాగానే ఎలా డబ్బులు చెల్లించగలదని టీఎస్ సర్కారు తరపున సీనియర్ అడ్వకేట్ఆర్.బసంత్ వాదించారు. డిపాజిటర్లు నష్టపోకుండా ఉండేందుకే నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది.
6 కోట్లు డిపాజిట్ చేయండి
కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఎఫ్ఐఓ అధికారి వద్ద రూ. 6 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్ లో పేర్కొన్నట్లుగా ఆరు వారాల్లో డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలని నిర్దేశించింది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన రూ .21 కోట్లు, ఈడీ అటాచ్ చేసిన రూ 22 కోట్లతో పాటు అమె ఎస్ఎఫ్ఐఓ వద్ద డిపాజిట్ చేయబోయే రూ . 6 కోట్లు . ఇలా దాదాపు రూ.50 కోట్లు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఏ సమాచారం అడిగినా ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025