మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- September 24, 2025
మాంట్రియల్: ఒమన్ ఎయిర్ సర్వీసులు మరో మూడు దేశాలకు విస్తరించారు. ఈ మేరకు ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) సిరియా, గయానా, కోట్ డి'ఐవోర్ దేశాలతో ఒప్పందం చేసుకుంది. కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) అసెంబ్లీ 42వ సెషన్ సందర్భంగా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
పౌర విమానయానంలో సహకారాన్ని పెంపొందించడం, జాతీయ విమానయాన సంస్థల నిర్వహణ హక్కులను విస్తరించడం లక్ష్యంగా ఈజిప్ట్‌తో కూడా ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది.
ఒమన్ తరపున పౌర విమానయాన అథారిటీ అధ్యక్షుడు నైఫ్ బిన్ అలీ అల్ అబ్రీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలు జాతీయ లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని అన్నారు. భాగస్వామి దేశాలతో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను పెంపొందించడంలో, ప్రాంతీయ లాజిస్టిక్స్ హబ్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన చెప్పారు.
మాంట్రియల్ వేదికగా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు ఒమన్ మరియు సంబంధిత దేశాల మధ్య విమాన రవాణా సంబంధాలను మెరుగుపరుస్తాయని అన్నారు. ఒమన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025