చైనీస్ శాస్త్రవేత్తల అద్భుతం..వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే జన్యు చికిత్స అభివృద్ధి

- January 20, 2021 , by Maagulf
చైనీస్ శాస్త్రవేత్తల అద్భుతం..వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే జన్యు చికిత్స అభివృద్ధి

బీజింగ్: బీజింగ్‌లోని శాస్త్రవేత్తలు కొత్త జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు. ఇది మనుషుల్లో వృద్దాప్యాన్ని ఆలస్యం చేయటమే కాకుండా సదరు జీవితకాలాన్ని పెంచుతుంది. ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో మానవాళికి ఇది ఎంతో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాట్ 7 అనే జన్యువు వృద్ధాప్యానికి కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్‌లోని ఒక పేపర్‌లో తెలిపింది.

ఈ పరిశోధన జరిపిన ప్రపంచపు తోలి దేశం చైనా అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ కు చెందిన 'వృద్ధాప్యం మరియు పునరుత్పత్తి' నిపుణుడు ప్రాజెక్ట్ సహ పర్యవేక్షకుడు ప్రొఫెసర్ క్యూ జింగ్ (40) అన్నారు.

"ఈ ఎలుకలు 6-8 నెలల తర్వాత మెరుగైన రూపాన్ని, శారీరక దృఢత్వాన్ని పొందటమే కాకుండా తమ జీవితకాలాన్ని 25% పొడిగించబడ్డాయి" అని క్యూ చెప్పారు.

వివిధ CAS విభాగాలకు చెందిన జీవశాస్త్రవేత్తల బృందం CRISPR / Cas9 పద్ధతిని వేలాది జన్యువులను పరీక్షించడానికి ఉపయోగించింది.వారు సుమారు 10,000 మందిలో 100 జన్యువులను గుర్తించారు. పాలిచ్చే జంతువులు కణాలలో కనిపించే పదివేల జన్యువులలో కాట్ 7 ఒకటి. లెంటివైరల్ వెక్టర్ అనే పద్ధతిని ఉపయోగించి పరిశోధకులు దీనిని ఎలుకల కాలేయాలలో క్రియారహితం చేశారు.

“మేము జన్యువు యొక్క పనితీరును వివిధ రకాల కణ రకాల్లో మానవ కాలేయ కణంలో మరియు ఎలుక కాలేయ కణాలలో పరీక్షించాము. ఎలుకల పై పరిశోధనా జరుపగా మేము ఎటువంటి దుష్ప్రభావాలను చూడలేదు. అయినప్పటికీ, ఈ పద్ధతి మానవులపై పరీక్షించేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది." అని క్యూ చెప్పారు. 

మొత్తానికి ఈ చైనా వాళ్లు మనిషికి వృద్దాప్యాన్ని ఆలస్యం చేయటంలో నిమగ్నులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com