పదే పదే హౌతీ ఉల్లంఘనలపై సౌదీ క్యాబినెట్ తీవ్ర ఆగ్రహం

- January 20, 2021 , by Maagulf
పదే పదే హౌతీ ఉల్లంఘనలపై సౌదీ క్యాబినెట్ తీవ్ర ఆగ్రహం

రియాద్:యెమెన్ సమస్య పరిష్కారం విషయంలో హౌతీ మిలీషియా పదే పదే ఉల్లంఘనలకు పాల్పడటాన్ని సౌదీ అరేబియా క్యాబినెట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హొదైదా గవర్నరేట్‌ని కేంద్రంగా చేసుకుని హైతీ మిలీషియా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండడాన్ని సౌదీ అరేబియా తప్పు పట్టింది. ఈ తరహా ఘటనలు ప్రాంత అస్థిరతకు కారణమవుతాయని సౌదీ క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. రీజియన్‌లో అభివృద్ధి వంటి కీలక విషయాలపై ఇటీవల క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రసంగాన్ని క్యాబినెట్ కొనియాడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com