సరఫరాలో ఆలస్యం: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ రీషెడ్యూల్

- January 21, 2021 , by Maagulf
సరఫరాలో ఆలస్యం: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ రీషెడ్యూల్

రియాద్:కోవిడ్ వ్యాక్సిన్ (ఫైజర్) సరఫరాలో ఆలస్యం కారణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆలస్యమవుతోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఈ మేరకు అధికారిక ఛానళ్ళ ద్వారా ఓ ప్రపకటన విడుదల చేశారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ సౌదీ అరేబియాలో అందుబాటులో వుంది. డిసెంబర్ 17 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రియాద్ సహా జెడ్డా, దమ్మామ్ మరియు మదీనాలలో వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఐదో కేంద్రాన్ని మక్కాలో ప్రారంభిస్తున్నారు. రానున్న కొద్ది వారాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. మరోపక్క, మినిస్ట్రీ, ఆస్ట్రాజెనకా మరియు మోడెర్నా వ్యాక్సిన్లను కూడా వినియోగానికి అనుమతిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com