ఏపీ డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణం:చంద్రబాబు
- January 21, 2021
అమరావతి:ఏపీలో వైసీపీ ప్రభుత్వం, డీజీపీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్మాద పాలనకు టీడీపీ నిరసన తెలియజేస్తోందని పేర్కొన్నారు. కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పడం నేరమా? అని నిలదీశారు. రాష్ట్రంలో అమలు చేసేది ఇండియన్ పీనల్ కోడా ? జగన్ పీనల్ కోడా? అని ధ్వజమెత్తారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డిని ఏ చట్టం కింద అనుమతించారని నిలదీశారు. అసలు డీజీపీకి లా అండ్ ఆర్డర్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా తమకు లెక్కలేదన్నారు. ఏ రూల్ కింద కళావెంకట్రావ్‌ను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాముడు తలను నరికేస్తే తాము వెలితే అడ్డుపడతారా అని ఫైర్ అయ్యారు. తమరు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తారా.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా అని మండిపడ్డారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి ఇవాళ తిరస్కరిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు