బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడి..28 మంది మృతి

బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడి..28 మంది మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులతో వణికిపోయింది. రెండు వరుస దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో నిత్యం రద్దీగా ఉండే తయారన్ స్క్వేర్ మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆత్మాహుతి సభ్యులు మార్కెట్లోకి దూరి తమను తాము పేల్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జనం భయంతో పరుగులు తీశారు.

ఏం జరిగిందో తెలుసుకునేలోపే మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మార్కెట్లో రక్తపు మద్దలు కనిపించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

 

Back to Top