దుబాయ్ డైలీ రెండు ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించిన ఖతార్
- January 21, 2021జీసీసీ సభ్య దేశాలతో ఉన్న పొరపొచ్చాలు సమిసిపోవటంతో ఆయా దేశాలకు రవాణా ఆంక్షలు కూడా తొలిగిపోయాయి. జల, రోడ్డు, రవాణాతో పాటు విమాన సర్వీసులను కూడా పలు దేశాలకు పునరుద్ధరిస్తోంది ఖతార్. ఇందులో భాగంగా యూఏఈ రాజధాని అబుధాబితో పాటు దుబాయ్ కి కూడా ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. జనవరి 27న దుబాయ్ కి తొలి ఫ్లైట్ బయల్దేరనుంది. అలాగే జనవరి 28న అబుధాబికి ఖతార్ నుంచి తొలి విమానం చేరుకుంటుంది. ప్రతి రోజు దుబాయ్ రెండు విమానాలు, అబుధాబికి ఒక విమాన సర్వీసును స్టార్ట్ చేస్తున్నట్లు ఖతార్ వెళ్లడించింది. ఇదిలాఉంటే..ఖతార్ తో జీసీసీ సభ్యదేశాలు ఎయిర్ స్పేస్ ను ఒపెన్ చేయటంతో ఇప్పటికే ఎయిర్ అరేబియా, ఎతిహాద్ ఎయిర్ వేస్, బడ్జెట్ ఎయిర్లైన్స్ ఫ్లై దుబాయ్ కూడా విమాన సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్