కోవిడ్ టైంలో యూఏఈ వదిలి వెళ్లిన 13 లక్షల మంది భారతీయులు

కోవిడ్ టైంలో యూఏఈ వదిలి వెళ్లిన 13 లక్షల మంది భారతీయులు

యూఏఈ:కోవిడ్ సంక్షోభం సమయంలో యూఏఈ నుంచి దాదాపు 13 లక్షల మంది ఇండియన్లు స్వదేశానికి తిరిగొచ్చారని భారత విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తితో చాలా మంది సొంతదేశాలకు వెళ్లినట్లు వివరించారు. అయితే..ఇండియాకు వచ్చిన వారిలో పదకొండున్నర లక్షల మంది ఇప్పటికే తిరిగి యూఏఈకి ప్రయాణం అయ్యారని అన్నారు. అంటే యూఏఈ నుంచి ఇండియాకు వెళ్లిన వారిలో ఇంకా కేవలం లక్షన్నర మంది మాత్రమే భారత్ లో ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ఈ వివరాలను తెలిపారు.

 

Back to Top