దుబాయ్: గ్లోబల్ విలేజ్ కొనసాగుతుంది

- January 22, 2021 , by Maagulf
దుబాయ్: గ్లోబల్ విలేజ్ కొనసాగుతుంది

దుబాయ్: దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్, ఓ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. దుబాయ్ టూరిజం అన్ని లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్  కార్యక్రమాల్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలు, హోటళ్ళు అలాగే రెస్టారెంట్లకు మాత్రమే వర్తిస్తుందని దుబాయ్ గ్లోబల్ విలేజ్ పేర్కొంది. గ్లోబల్ విలేజ్ కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయనీ, సందర్శకులకు ప్రవేశం కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కళ్ళు చెదిరే రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శితమవుతాయని మరో ప్రకటనలో గ్లోబల్ విలేజ్ పేర్కొంది. సందర్శకుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా పలు చర్యలు చేపట్టినట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com