జనవరి 24నుంచి ఫ్లైట్స్ లో 35 మందికే అనుమతి..కువైట్ ఉత్తర్వులు
- January 23, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి కువైట్ కు వచ్చే విమానాల్లో 35 మంది ప్రయాణికులకు మించి ఉండొద్దని నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ నుంచి ఆపరేట్ చేసే అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. సంఖ్యతో పరిమితి లేకుండా ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు ప్రయాణికులను తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ జారీ చేసిన చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రయాణికుల కుదింపు ఉత్తర్వులను జారీ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







