మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్న అష్గల్
- January 23, 2021
దోహా:పబ్లిక్ వర్క్స్ అథారిటీ, ఈ ఏడాది మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనుంది. అయిన్ ఖాలిద్, అల్ సాద్ మరియు అల్ ఖోర్‌లలోని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్నట్లు అష్గల్ ప్రకటించింది. ఈ కొత్త హెల్త్ సెంటర్లలో జనరల్ మరియు స్పెషల్ క్లినిక్‌లు, డెంటిస్ట్రీ, ఫిజియోథెరపీ మరియు ఫ్యామిలీ విభాగాలుంటాయి. ఈ మూడు సెంటర్లు 2021 తొలి క్వార్టర్‌లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అష్గల్ పేర్కొంది. కాగా, సౌత్ అల్ వక్రకా హెల్త్ సెంటర్, 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించనుంది. తొమ్మిది క్లినిక్‌లతో ఇది రూపు దిద్దుకుంటోంది. 125 కార్లకు పార్కింగ్, అంబులెన్సుల గ్యారేజీని ఏర్పాటు చేశారు. అల్ సాద్ హెల్త్ సెంటర్ 29,022 చదరపు మీటర్లలో 100 క్లనిక్స్‌తో ఏర్పాటవుతోంది. అల్ ఖోర్ సెంటర్‌ని 24,998 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేస్తున్నారు. 60 క్లినిక్‌లు రోజుకి 650 మంది విజిటర్స్ కోసం వీలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







