భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

జెనీవా:కరోనాను కట్టడి చేయడంలో భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే మన దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్‌లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు మనదేశం ఉచితంగానే టీకాను అందజేస్తోంది. బ్రెజిల్‌తో పాటు పలు దేశాలకు టీకాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయనున్నారు. ఈ క్రమంలో భారత్‌పై WHO ప్రశంసలు కురిపించింది.

''కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు సాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఒకరికొకరం సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పోరాడితేనే వైరస్‌ను నిర్మూలించగలుగుతాం. ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడలుగుతాం.'' అని WHO డీజీ డెడ్రోస్ గ్యాబ్రియేసస్‌ పేర్కొన్నారు.

Back to Top