ప్రైవేటు సెక్టార్లో 115,000 మంది పౌరులకు ఉద్యోగావకాశాలు
- January 25, 2021రియాద్:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్స్ మరియు సోషల్ డెవలప్మెంట్, పలు ప్రముఖ కంపెనీలతో ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రైవేటు సెక్టార్లో 115,000 మంది సౌదీలకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ఒప్పందం కుదరనుంది. తవ్తీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ చర్యలు చేపడుతున్నట్లు లేబర్ సెక్టార్ డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్లాహ్ అబుతనైన్ అలాగే సోషల్ డెవలప్మెంట్ సెక్టార్ డిప్యూటీ మినిస్టర్ మాజెద్ అల్ ఘనెమి వెల్లడించారు. 2021 మినిస్ట్రీ బడ్జెట్లో సౌదీ యువతకు ఉద్యోగాలు సహా అనేక అంశాలకు కీలక ప్రాధాన్యతనిస్తున్నారు. మూడు నెలలుగా ఉద్యోగానికి దూరంగా వుంటున్నవారు, ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం