రైతుల ర్యాలీ: అమిత్ షా అత్యవసర సమాచారం
- January 26, 2021
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే సమీక్షించేందుకు ఆ శాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. హోంశాఖ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చర్చించనున్నారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేయడంపై కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బారికేడ్లు, బస్సులు, కంటైనర్లను తోసుకుంటూ ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. హింసాత్మక చర్యలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను సైతం నిలుపుదల చేశారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..