తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 27, 2021
హైదరాబాద్:తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 147 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు మృతి చెందారు.. ఇదే సమయంలో 399 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,93,737 కు పెరగగా.. ఇప్పటి వరకు 1,593 మంది కరోనాతో మృతి చెందారు.. 2,89,325 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా .. రికవరీ రేటు దేశంలో 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.49 శాతానికి పెరిగిందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,819 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 1,295 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,486 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 77,28,296కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







