పచ్చని సంసారాలను బుగ్గి పాల్జేస్తున్న సామాజిక మాధ్యమాలు
- February 24, 2016
దుబాయ్ లో గత ఏడాది నమోదు కాబడిన పలు వైవాహిక విభేదాలకు సామాజిక మాధ్యమాలు ముఖ్య కారణమవుతున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది. ' పేస్ బుక్ , ట్విట్టర్ , వాట్సాప్ ' తదితర సామాజిక మాధ్యమాలు భార్య భర్తల అనుబంధం మధ్య అనుమాన కుంపట్లు రగిలిస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఇరువురి నడుమ రహస్య పరిచయాలు వైవాహితెర స్నేహాలు అనేక సమస్యలను సృష్టించడమే కాక కొన్ని సందర్భాలలో అవి విడాకులతో ముగుస్తున్నాయి. ఈ విషయాలను ఇటీవల ' దుబాయ్ కమ్యునిటీ అభివృద్ధి సంస్థ ' కుటుంబం మరియు యువత విభాగం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెలుగు చూశాయి. ఆ విభాగపు దర్శకురాలు నెమ అల్ శంసి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు కారణంగా ఏర్పడిన నూతన స్నేహాలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు 2015 దుబాయ్ లో అనేకమంది జీవితాలలో వైవాహిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం అయ్యందని ఆమె చెబ్తూ, తన విభాగపు పరిధిలో 2015 లో 245 వైవాహిక వివాదాలకు కీలక కారణం ' పేస్ బుక్ , ట్విట్టర్ , వాట్సాప్ ' తదితర సామాజిక మాధ్యమాలని ఆరోపించారు. అత్యధిక కేసులలో భర్త లేదా భార్య కంప్యుటర్లో గాని మొబైల్ ఫోన్లలో గాని తనకు తెలియకుండా జీవిత భాగస్వామి చేసే ద్రోహాన్ని అకస్మాత్తుగా చూడటం జరుగుతుందని, దీంతో తాను మోసపోతున్నాని లోలోన కుమిలిపోతూ ఆ వ్యక్తితో తెగతెంపులు చేసుకొనేందుకు మానసికంగా సిద్ధపడి పోతున్నారని నెమ అల్ శంసి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







