వలస ఉద్యోగుల భర్తీ ఫీజును పెంచిన ఒమన్
- January 27, 2021
మస్కట్:కార్మికేతర ఉన్నత ఉద్యోగాల్లో వలసదారుల భర్తీకి చెల్లించాల్సిన ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది ఒమన్ ప్రభుత్వం. అంతేకాదు..వలసదారుల సర్వీసు తదనంతరం హక్కులను కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి సోషల్ ఇన్సూరెన్స్ ఫండ్ కు బదిలీ చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక చట్టాలు, సివిల్ సర్విస్ చట్టాల్లో సవరణలు చేసినట్లు వెల్లడించింది. సవరణ చేసిన రిక్రూట్మెంట్ ఫీజు వివరాలు..
- అడ్మినిస్ట్రేటీవ్, ఎగ్జిక్యూటీవ్ పొజిషన్ లో ఉద్యోగాల భర్తీ ఫీజును 2,001 రియాల్స్ గా నిర్ణయించారు.
- మధ్య స్థాయి ఉద్యోగాల భర్తీలో వలసదారుల భర్తీ ఫీజు 1,001 రియాల్స్
- ప్రత్యేక నిపుణత, టెక్నికల్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ ఫీజు 601 రియాల్స్
- మత్స్యకారుల భర్తీ ఫీజు 361 రియాల్స్
- ఒకరి నుంచి ముగ్గరు వరకు వలస గృహ కార్మికుల భర్తీ ఫీజు 141...అదే నలుగురికి మించి గృహ కార్మికుల భర్తీకి మరో 241 రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది.
- వ్యవసాయం, తోటల పెంపకానికి సంబంధించి ముగ్గురు వలస రైతుల భర్తీకి 201 రియాల్స్, నలుగురి కంటే ఎక్కువ మంది ఉంటే మరో 301 రియాల్స్ ఫీజు చెల్లించాలి.
- ఇక కార్మికుల వివరాలను మార్చేందుకు 5 రియాల్స్, వలస కార్మికులు ఒక యజమాని నుంచి మరో యాజమానికి మారేటప్పుడు 5 రియాల్స్ చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..