మహిళ పోలీస్ సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం: సీపీ సజ్జనార్
- January 27, 2021
హైదరాబాద్:"షీ పాహి", ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. కాగా, సైబరాబాద్ లో డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను సినీ నటి అనుష్క ప్రారంభించారు.ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.
తెలంగాణ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ లో 750 ఉమెన్ పోలీసులు ఉన్నారు. ఒక యానువాల్ మీట్ లాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. "షీ పాహి" కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళ సిబ్బందిలో స్ఫూర్తి నింపుతాం. తెలంగాణ ప్రభుత్వం 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. సీనియర్ ఆఫీసర్స్ లో 50 శాతం మహిళలు ఉన్నారు. మహిళ సిబ్బందికి కేసు ల దర్యాప్తు లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. సైబరాబాద్ లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారు. ఉమెన్ సిబ్బంది కి ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్ పై శిక్షణ ఇస్తాం. ట్రాఫిక్ లో సైతం మహిళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మనల్ని సృష్టించింది తల్లి... నా తల్లికి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను.షి టీమ్స్ ఒక మహా యజ్ఞం.. మహిళల భద్రత కోసం TCOPS నిరంతర కృషి చేస్తున్నాయి.తెలంగాణ షి టీమ్స్ దేశానికే ఆదర్శం.. మెన్ ఆఫీసర్స్ కు ధీటుగా 60 కేసులను.. షీ టీమ్స్ పరిస్కరించాయి.. షీ టీమ్స్ వెహికిల్స్ ను నేడు మహిళ పోలీసులే నడుపుతున్నారు.. విమెన్ క్యాబ్.. లను షి టీమ్స్ పోత్సహిస్తున్నాయి. బాల మిత్ర ద్వారా 6 వేల టీచర్ లను ట్రైన్ చేసి.. వాళ్ళ ద్వారా పిల్లల సమస్యలను పరిస్కరిస్తున్నాం. మహిళల రవాణా కోసం సేఫ్టీ కోసం ఈ బస్ లు పనిచేస్తున్నాయి. మీ శక్తిని ఉపయోగించి సమ సమాజాన్ని నిర్మించాలి.. నేర రహిత భారతాన్ని మీరంతా నిర్మించాలి అని సీపీ సజ్జనార్ తెలిపారు
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు