సరఫరాలో ఆలస్యం: మరోమారు కోవిడ్ వ్యాక్సినేషన్ రీ-షెడ్యూల్
- January 29, 2021రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరోమారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రీ-షెడ్యూల్ చేసింది. సరఫరాలో అంతరాయాల నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను రీ-షెడ్యూల్ చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. తయారీదారు నుంచి సౌదీ అరేబియాతోపాటు ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాక్సినేషన్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు మినిస్ట్రీ వివరించింది. కాగా, రెండో డోస్, మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఆరు వారాల్లోపు వేయించుకోవాల్సి వుంటుంది. జనవరి 20న వ్యాక్సినేషన్ రీ-షెడ్యూల్ అయినట్లు మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్ అలసత్వం కారణంగానే ఈ సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే మరిన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పక్రియ వేగం పుంజుకుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు