కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 1500 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 29, 2021
మస్కట్:కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధించడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల కోసం బంధు మిత్రుల్ని పరిమితులకు లోబడి ఆహ్వానించేవారు తప్పక కరోనా నిబంధనల్నఇ పాటించాల్సి వుంటుంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 1500 ఒమన్ రియాల్స్ వరకు జరీమానాని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, కోవిడ్ 19 టెస్ట్‌కి నిరాకరిస్తే 200 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. హోం లేదా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉల్లంఘనకు పాల్పడితే 200 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. పబ్లిక్ గేదరింగ్స్, వివాహాలు, అంత్యక్రియల్లో పాల్గొని నిబంధనల్ని ఉల్లంఘిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. ట్రాకింగ్ బ్రాస్లెట్ని తొలగిస్తే 300 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









