యూఏఈ:కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని లీక్ చేస్తే Dh1 మిలియన్ ఫైన్

- January 30, 2021 , by Maagulf
యూఏఈ:కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని లీక్ చేస్తే Dh1 మిలియన్ ఫైన్

యూఏఈలోని ఉద్యోగులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గోప్యత పాటిచాల్సిన కీలక సమాచారాన్ని ఎవరైన ఉద్యోగులు ఇతరలకు చేరవేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. కాన్ఫిడెన్షియల్ విషయాలను ఏ విధంగా లీక్ చేసినా నేరంగానే పరిగణిస్తామని, అందుకు బాధ్యుడైన వ్యక్తికి కనీసం ఆరు నెల జైలు శిక్ష ఉంటుందని వెల్లడించింది. అలాగే కనిష్టం 500 దిర్హామ్ ల నుంచి ఒక మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమాన..కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమాన ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. గోప్యత పాటించాల్సిన సమాచారాన్ని లీక్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అవగాహన కల్పిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియో రిలీజ్ చేసింది. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అక్రమంగా సమాచారాన్ని తరలించటం చట్టవిరుద్ధమని పేర్కొంది. అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ వినియోగించి ఇతరుల గోప్యతకు భంగం కలిగించినా..ఇతరులను కించపరిచినా జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com