APNRTS వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం
- January 30, 2021
ఏ.పీ:ఏ.పీలోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగరానికి చెందిన వాసుపల్లి శ్రీనివాస్ (39) యూఏఈలోని షార్జాలో ప్రమాదవశాత్తు పని చేస్తున్న టాంకర్ నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి గత నెల 10వ తేదీన మృతిచెందాడు.అతని మృతదేహాన్ని ఈ రోజు దుబాయ్ నుంచి సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహం సహాయముతో షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేర్చడం జరిగింది.హైదరాబాద్ నుంచి స్వస్థలం,కాకినాడ వరకు APNRTS వారి సహకారముతో ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు మృతదేహం చేర్చడం జరిగింది.మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇటువంటి ఆపత్కాలములో విదేశాలలో నివసిస్తున్న వారికి ఈ విధమైన సహాయకార్యక్రమాలు చేస్తున్న ఏ.పీ ముఖ్యమంత్రి వై.స్.జగన్ మోహన్ రెడ్డికి,APNRTS ఛైర్మన్ వెంకట్ మేడపాటి,APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల,గుండెల్లి నరసింహంకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …