గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో వినూత్న ప్రదర్శన
- January 30, 2021
తెలంగాణ:విదేశాలలో అసువులుబాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు 'గల్ఫ్ జెఏసి' ఆధ్వర్యంలో ఇద్దరు గల్ఫ్ కార్మికుల అంతిమయాత్రలో వేరువేరుగా ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట, పసునూరు గ్రామాలలో శనివారం జరిగింది.
మేడిపల్లి మండలంలోని రాగోజిపేటకు చెందిన ఇల్లెందుల లక్ష్మణ్ సౌదీ అరేబియాలో మృతిచెందగా, పసునూరుకు చెందిన గసిగంటి నారాయణ యుఎఇ దేశంలోని షార్జాలో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఒకే అంబులెన్సులో రెండు శవపేటికలను ఆయా గ్రామాల వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ నాయకత్వంలో గల్ఫ్ ప్రవాసీ కార్మికుల అంతిమయాత్రలో ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల మృతధన సహాయం ఇవ్వాలని వారు ఈ సందర్బంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!