మొత్తానికి వుహాన్ మార్కెట్‌లో WHO బృందం
- January 31, 2021
కరోనా వైరస్ పుట్టుక స్థలం, దాన్ని మూలాలను పరిశోధించే క్రమంలో చైనాకు చేరిన డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిపుణుల బృందం ఎట్టకేలకు వూహాన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. మనుషుల్లోకి కరోనా వైరస్ సంక్రమించేందుకు ఈ మాంసపు మార్కెటేనని యావత్ ప్రపంచం భావిస్తోంది. ఎందుకంటే తొలి కరోనా కేసు ఇక్కడే బయటపడింది. దీంతో నిపుణుల బృంందం అక్కడ జరిపే పరిశోధనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డబ్ల్యూహెచ్‌వో టీమ్ పర్యటన సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ చూట్టూ బారికేడ్స్ అమర్చారు. మరోవైపు మార్కెట్ దగ్గరికి వచ్చిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని అక్కడి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగబోయారు. కానీ వాటికి సమాధానం చెప్పుకుండానే లోపలికి వెళ్లిపోయారు.

ప్రస్తుత వుహాన్ మార్కెట్ మూసివేసే ఉంది. ప్రజలే కాదు వ్యాపారులు కూడా అక్కడికి వెళ్లేందుకు అనుమతినివ్వడం లేదు. గతంలో వివిధ రకాల మాంసం స్టాళ్లతో ఈ మార్కెట్ చాలా రద్దీగా ఉండేది. అయితే డిసెంబర్ 31,2019న ఆ మార్కెట్‌కు వెళ్లొచ్చిన నలుగురిలో న్యూమోనియా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ రాత్రికి రాత్రే ఆ మార్కెట్‌ను మూసివేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







