ఇటు ఉద్యోగం, అటు వ్యాపారం

- February 24, 2016 , by Maagulf
ఇటు ఉద్యోగం, అటు వ్యాపారం

పబ్లిక్‌ సెక్టార్‌కి చెందిన ఉద్యోగులు ఇకపై చిన్న చిన్న వ్యాపారాలను నిర్మించుకోవచ్చు. అది కూడా వారి ఉద్యోగాలను వదులుకోకుండానే. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిక ట్విట్టర్‌ అక్కౌంట్‌లో ఈ సర్క్యులర్‌ని పొందుపరిచారు. ఒమన్‌ యూత్‌, తమ సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతనం దక్కని సెలవు సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు తీసుకుని, వారి వారి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదా సెలవు పెట్టడం అనే రెండు ఆప్షన్స్‌ని ఇందులో పొందుపరిచారు. రాజీనామాకి సంబంధించిన, సెలవుకు సంబంధించిన నిబంధనల్నీ వివరంగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగి మూడేళ్ళ పాటు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే 15 సంవత్సరాలు సర్వీస్‌ దాటి ఉండకూడదు. 45 ఏళ్ళ వయసు దాటకుండా ఉండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com