తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 02, 2021
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక లాక్ డౌన్ కరోనా మార్గదర్శకాల్లో కూడా నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739కి చేరింది. ఇందులో 2,91,115 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 1602కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







