జీసీసీ సిటిజన్లు, ప్రవాసీయులపై ఆధారపడిన వారికి కూడా అబ్షర్ అకౌంట్లు
- February 02, 2021
సౌదీ: అబ్షర్ అకౌంట్ ద్వారా అందే ఈ-సర్వీసులను దేశంలోని అందరూ వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది సౌదీ అరేబియా ప్రభుత్వం. జీసీసీ దేశాలకు చెందిన పౌరులు, సౌదీలో ఉంటున్న ప్రవాసీయులపై ఆధారపడిన వారు, పర్యాటకులు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అబ్షర్ అకౌంట్లు తెరిచేందుకు వీలు కలిపించింది. తద్వారా ఇక నుంచి ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ లో పొందెందుకు వీలు కలుగుతుంది. జాతీయ సమాచార కేంద్రం సహకారంతో డైరెక్టరేట్ ఆఫ్ పాస్ పోర్టు విభాగం నిర్ణయం మేరకు జీసీసీ సీటిజన్లు, పర్యాటకులు, ప్రవాసీయులపై ఆధారపడిన వారికి ప్రయోజనం కలగనుంది. ప్రవాసీ ఉద్యోగులపై ఆధారపడిన వారు అబ్షర్ అకౌంట్లో రిజిస్టర్ అయ్యేందుకు రెసిడెంట్ ఐడీ నెంబర్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే జీసీసీ దేశాల పౌరులు, టూరిస్ట్ వీసాదారులు తమ బోర్డర్ ఎంట్రీ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్, జవజత్ బ్రాంచులు, అబ్షర్ సేవలు అందిస్తున్న బ్యాంకు వెబ్ సైట్ల ద్వారా కూడా అబ్షర్ అకౌంట్ రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వం అందించే ఈ-సర్వీసులను పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..