ఒళ్ళు గగుర్పొడిచే ఆనవాయితీ..సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి...
- February 02, 2021
ప్రపంచంలో అనేక ప్రాంతాలు.. ఈ ప్రాంతాల్లోని ప్రజల్లో జన్మలపై.. మరణాల పై రకరకాల విశ్వాసాలు.. తమ తమ మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులను ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్దాసక్తులతో పాటిస్తారు. ఇక మనిషి మరణం పై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశ్వాసం.. ఈ కోవలోకే వచ్చేవి.. ఈజిప్టు పిరమిడ్లు. భారత్, చైనా, కొరియా, అమెరికా ఇలా ఏదేశమైన వారి వారి సంప్రదాయాలను అనుసరించి మరణించినవారిని గౌరవిస్తారు. ఇక మనదేశంలో అయితే మనిషి మరణం తర్వాత.. కర్మకాండలు నిర్వహించడం.. ఏడాదికి ఒకసారి.. సంవత్సరీకం అంటూ మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం చేస్తుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల్లో ఆచారాలు భీతిగొలిపేవిగా, అసలు ఇటువంటి ఆచారాలు ఉంటాయా ..? అనిపించేవిగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇండోనేషియాలోని ఓ గ్రామంలో సంవత్సరీకాలు షాక్ కలిగించేవిగా ఉంటాయి.
ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.. మరణించిన వ్యక్తి పై ఆ గ్రామ ప్రజలు చూపే ప్రేమ, గౌరవం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరణించిన వ్యక్తిని ఏడాదికి ఒకసారి సంవత్సరీకం పేరుతో గుర్తు చేసుకోవడం.. సహజం.. వారిపేరుతో అన్నదానం, వస్త్ర దానం వంటివి నిర్వహిస్తాం.. కానీ రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం మరణించిన వారి పార్ధివ దేహాన్ని ఏడాదికి ఒకసారి సమాధి నుంచి వెలికితీస్తారు. అనంతరం వాటిని రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికి ఉన్నప్పుడు ఎలా జీవించారో అదే విధంగా శవాలను రెడీ చేస్తారు. వారికి నచ్చిన రంగుల దుస్తులను ధరింప జేసి, సిగరెట్లు, కళ్ళజోడు, తినే ఆహార పదార్ధాలను ఏర్పాటు చేస్తారు.. తర్వాత శవాలను ఇంటికి తీసుకొని వచ్చి.. బతికి ఉన్న సమయంలో ఏ ప్లేస్ లో ఇష్టంగా కూర్చుండే వారో ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండగలా సంబరాలు చేసుకొంటారు.. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్తుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడిన తర్వాత గ్రామస్తులంతా శవాలను తిరిగి భధ్రంగా స్మశానానికి చేరుస్తారు.. యధావిధిగా సమాధిని మూసేస్తారు.. రాత్రంతా వారు జాగరణ చేస్తూ మరణించినవారిని తలుచుకుంటూ గడుపుతారు.. ఇదండీ.. ఇక్కడ మనిషి మరణించిన తర్వాత సంవత్సరీకాలు జరిపే విధానం..!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు