ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ ధరలపై ఎయిర్ లైన్స్ కువైట్ సూచనలు
- February 02, 2021
కువైట్ సిటీ:పలు దేశాల నుంచి కువైట్ ఇంటర్నేనల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టులు నిర్వహించుకోవాలని ఆదేశించిన డీజీసీఏ..ల్యాబ్ ఛార్జీలపై మరోసారి స్పష్టతనిచ్చింది.విమాన ప్రయాణికులకు రెండు విడతలుగా నిర్వహించే పీసీఆర్ టెస్ట్ ఛార్జీలు 60 దినార్లకు మించి ఉండరాదని సూచించింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా టెస్ట్ గరిష్ట దర 30 దినార్లకు మించకూడదన్న నిబంధనలకు అనుగుణంగా రెండు టెస్టులకు కలిపి 60 దినార్లను నిర్ణయించినట్లు వివరించింది.అయితే..రెండు టెస్టులకు కలిపి 60 దినార్లు దాటొద్దని ఆదేశిస్తూనే..విమానయాన సంస్థలు సింగిల్ టెస్టుకు 30 దినార్లు అనేది తప్పనిసరి కాదంటూ మరో మెలిక పెట్టింది.అయితే..దీన్ని ఎలా అమలు చేస్తాయో అనేది స్పష్టత రావాల్సి ఉంది.ఇదిలాఉంటే..విమానాల సంఖ్య పరిమిత సంఖ్యలో ఉండటం కారణంగా ఫ్లైట్ ఛార్జీలు రాకెట్ లా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







