కువైట్ ను వెంటాడుతున్న కోవిడ్..నేటి అధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు?

- February 03, 2021 , by Maagulf
కువైట్ ను వెంటాడుతున్న కోవిడ్..నేటి అధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు?

కువైట్ సిటీ:కువైట్ ను కోవిడ్ వైరస్ వెంటాడుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గి..వైరస్ వ్యాప్తి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే 811 పాజిటివ్ కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్లుగా ఇదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ అధికారులు, సివిల్ ఏవియేషన్ అధికారులు సమావేశం కాబోతున్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ సమావేశంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనాలున్నాయి. అవసరం అయితే..ఎయిర్ పోర్టుల మూసివేతకు కూడా సిద్ధపడే ఛాన్సెస్ ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తో రావాలి. కువైట్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే..ప్రయాణికులు తాము బయల్దేరే దేశాల్లో పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తో వస్తున్నా...చాలామందికి ఎయిర్ పోర్టులో నిర్వహించే పరీక్షలో కోవిడ్ పాజిటీవ్ వస్తోందని సివిల్ ఏవియేషన్, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రయాణికులు తప్పుడు రిపోర్టులతో వస్తున్నట్లు భావించాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాలపై నేటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com